ప్రస్తుతం గుంటూరు కారం సినిమా వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది. సినిమా ఎనౌన్స్ చేసినపుడు అంత పాజిటివ్ గానే ఉండగా షూటింగ్ జరుగుతున్న కొద్దీ మాత్రం సినిమాకి సంబందించి ఎదో ఒక వివాదాస్పద న్యూస్ తో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాపై కంటే పవన్ కళ్యాణ్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేయడంతో మొదలైన ఈ వివాదాల పర్వం ఈరోజుకి కూడా కొనసాగుతూనే ఉంది.
గుంటూరు కారం స్క్రిప్ట్ త్రివిక్రమ్ పూర్తిగా రెడీ చేయకుండా సినిమా స్టార్ట్ చేయడంతో మూవీ యూనిట్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తప్పుకోగా, లేటెస్ట్ గా హీరోయిన్ పూజ హెగ్డేని కూడా తీసేసారు అని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. హీరోయిన్ ని సినిమాలో నుంచి తీసివేయం ఏంటని ఆశ్చర్యానికి గురి కావాల్సిన పరిస్థితి వస్తోంది. ఇవన్నీచూస్తుంటే అసలు సినిమా షూటింగ్ జరిగిందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ చేసి ఆ ఫుటేజ్ అంత డిలీట్ చేశారనే రూమర్స్ రాగా. ఆ వార్తలే నిజం అనిపిస్తోంది. అయితే పూజా హెగ్డే ని తీసేయమని మహేష్ చెప్పిన కూడా త్రివిక్రమ్ ఈ విషయానికి అంగీకరించడం లేదని టాక్. దాంతో మహేష్ త్రివిక్రమ్ పై చాలా సీరియస్ గా ఉన్నడటా. పూజా హెగ్డే ఉంటె సినిమా చేయను అని మహేష్ తెగేసి చెప్పడంతో గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డేని తీసేసినట్టు తెలుస్తోంది..!!