పూజా హెగ్డే సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు ఉండే ఫాలోవర్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఫేస్బుక్ లేదా ఇంస్టాగ్రామ్ వంటి వాటిలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు. ఇలా మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ హీరోయిన్లకు ఉంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫాలోవర్స్ గురించి పూజా హెగ్డే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
నాకు ఇన్ స్టాగ్రామ్ లో 38 మిల్లియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కానీ నా సినిమాని అంతమంది ఆడియన్స్ థియేటర్స్ లో చూడరు. నాకు ఉన్నటువంటి ఫాలోవర్లు పెద్దపెద్ద స్టార్స్ కి కూడా లేరు. నాకు మాత్రమే కాదు ఎంతోమంది హీరోయిన్లకు ఇలా బిగ్గెస్ట్ స్టార్ హీరోల కంటే కూడా ఎక్కువ మంది ఫాలోవర్స్ ని కలిగి ఉన్నారు. వాళ్లంతా నిజమైన అభిమానులు కాదు. కేవలం మేము పెట్టే కంటెంట్ ని బట్టి వచ్చే వాళ్ళు వాళ్లంతా అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు..!!