2021 నుంచి ఆమెకు అదృష్టం కలసి రాలేదు. చేసిన సినిమాలు అన్ని బోర్లా బొక్క పడ్డాయి..ఇటీవలి కాలంలో పూజా స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపిస్తున్నారు. ఆమె కూలి సినిమాలో మోనికా అనే పాటలో కనిపించారు. కానీ ఈ సినిమాకు కూడా మిశ్రమ స్పందన వచ్చింది. పూజా హెగ్డే ఉండటం వల్లే సినిమా ప్లాప్ అయిందని కొందరు విమర్శించినా, ఆమె అభిమానులు మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. మోనికా పాటలో పూజా హెగ్డే అద్భుతమైన స్టెప్పులు వేశారు..
ఆమె త్వరలో రాబోయే జన నాయగన్ సినిమాలో కూడా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో దళపతి విజయ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా విజయ్ చివరి సినిమా అని చెబుతున్నారు. ఒకవేళ అది నిజమైతే, ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలి. అయితే, పూజా హెగ్డే ఉండటంతో ఈ సినిమా కూడా ప్లాప్ అవుతుందేమోనని కొందరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. పూజా హెగ్డే మళ్లీ ఎప్పుడు విజయాల బాట పడతారో చూడాలి..!!