in

Pooja Hegde announces her foundation ‘All About Love’!

టీవల మీడియాతో మాట్లాడుతూ పూజా హెగ్డే తన ఛారిటీ సంస్థ గురించి చెప్పింది. తన నటనను అభిమానించి, ఆదరించి ప్రజలు ఇవాళ తనకో స్థానాన్ని కల్పించారని, అలాంటి వారికి తిరిగి తాను ఏదో ఒక చిన్నసాయమైనా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఛారిటీని ప్రారంభించానని పూజా తెలిపింది. ప్రజలు ఇచ్చిన ఆ స్థానాన్ని టేకిట్ గ్రాంట్ గా తాను తీసుకోలేనని, సమాజానికి తిరిగి మన వంతు సాయాన్ని పెద్దగానో, చిన్నగానో చేసేలా ఇతరులను ప్రేరేపించాలన్నదే తన ఆలోచన అని ఆమె చెప్పింది. మనస్ఫూర్తిగా మనం చేసే సేవతో సమాజంలో మార్పు తప్పక వస్తుందనే నమ్మకం తనకుందని ఆమె అన్నారు.

‘ఆల్ ఎబౌట్ లవ్’ ఛారిటీ సంస్థను ప్రారంభించక ముందు కూడా పూజా హెగ్డే పలు సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంది. పేండమిక్ సిట్యుయేషన్ సమయంలో వందమంది రోజువారి కూలీలకు ఒక నెలకు సరిపడా నిత్యావసరాలను అందించింది. అలానే క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారులకు మందులు ఇవ్వడం, కుటుంబ పెద్ద మంచాన పడిన వారికి బాసటగా నిలవడం చేసింది. తన ఫౌండేషన్ ద్వారా మంగళూర్ లోని దివ్యాంగ పిల్లలకు కృత్రిమ అవయవాలకై పూజా హెగ్డే కొంత మొత్తాన్ని విరాళం అందించింది.

KEERTHI SURESH AMMA GAARITHO KALiSI PAATA PADINA MEGA STAR!

narappa’s director Srikanth Addala’s Next Is A Triology!