తమిళనాట ఒక రాజకీయ పార్టీ కక్ష సాధింపుకు బలి అయిన నటుడు సుధాకర్ సినీ జీవితం.భారతి రాజా వంటి దర్శకుడి ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు హీరో గ పరిచయం అయిన సుధాకర్ కెరీర్ అర్ధాంతరంగా మారిపోయింది. తమళ చిత్ర పరిశ్రమలో దాదాపు 40 చిత్రాలలో హీరో గ నటించిన సుధాకర్, రాధిక గారికి జంటగా 11 చిత్రాలలో నటించారు. ఎదురులేని హీరోగా ఎదుగుతున్న క్రమంలో సుధాకర్ గారిని తమిళనాడులోని ఒక రాజకీయ పార్టీ వారు తమ పార్టీలో చేరమని ఒత్తిడి చేసారు. సినిమా కెరీర్ ముఖ్యం అనుకున్న సుధాకర్ గారు, అందుకు నిరాకరించటం తో ఆగ్రహించిన రాజకీయ పార్టీ వారు సుధాకర్ సినిమాలు రిలీజ్ సమయం లో ఇబ్బందులు సృష్టించటం,
పరాయి భాష నటుడిని పెట్టి చిత్రాలు నిర్మిస్తే ఊరుకునేది లేదని నిర్మాతలను బెదిరించటం తో సుధాకర్ కు అవకాశాలు తగ్గాయి. ఆ తరువాత సుధాకర్ గారే నిర్మాతగా మారి ” చందన మలార్గళ్” అనే చిత్రం నిర్మించి తన ప్రతిభను చాటుకోవాలని ప్రయత్నించారు, చివరకు ఆ సినిమా రిలీజ్ కాకుండా అడ్డుపడి సుధాకర్ ను ఇబ్బందుల పాలు చేసారు. ఆ సంఘటనతో విసిగిపోయిన సుధాకర్ తమిళ చిత్ర రంగానికి గుడ్ బై చెప్పి, తెలుగు చిత్ర రంగంలో తన భవిషత్తును వెతుక్కొంటూ ఇక్కడకు వచ్చి స్థిరపడిపోయారు.