డీఫ్ ఫేక్ వీడియో నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంపై నటి రష్మిక హర్షం వ్యక్తం చేసింది. ‘‘ఢిల్లీ పోలీసులకు కృతజ్ఞతలు. ప్రేమతో నన్ను ఆదరించి, అన్ని రకాలుగా అండగా నిలిచేవారు నా చుట్టూ ఉన్నందుకు సంతోషిస్తున్నా. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. యువతకు చెప్పేదొక్కటే..
అనుమతి తీసుకోకుండా మీ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఎక్కడైనా ఉపయోగిస్తే అది నేరం’’ అని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బిట్రీష్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ జారా పటేల్ వీడియోకు నిందితుడు కృత్రిమ మేధ సాయంతో రష్మిక ముఖాన్ని జోడించి వైరల్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మండిపడ్డారు. కృత్రిమ మేధ దుర్వినియోగమవుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రష్మిక కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది..!!