in

‘PELLI CHOOPULU’ HEROINE IN RAVI TEJA’S NEXT!

ఘు చిత్రాలతో ప్రేక్షకులకి పరిచయం అయింది నటి రీతూ వర్మ.. ఇక విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా వెండితెరకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్నఈ భామ, ఆ తర్వాత చాలా సెలెక్టివ్ గా పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది. ఆమె టాలెంట్ ని గుర్తించిన కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ అమెకి తనతో కలిసి నటించే అవకాశాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత మలయాళం, తమిళ్ బాషలలో సినిమాలు చేస్తూ అక్కడ మంచి పేరు సంపాదించుకుంది.

అయితే టాలీవుడ్ లో ఇప్పుడు ఈ అమ్మడు జోరు మామాలుగా లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది రీతూ. ఇప్పటికే నేచురల్ స్టార్ నానితో హీరోగా వస్తున్న టక్ జగదీష్ లో నటిస్తుంది. అలాగే యంగ్ హీరో శర్వానంద్ తాజా చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. అయితే తాజాగా రవితేజ – రమేష్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న ఓ సినిమాలో కూడా రీతూ వర్మనే హీరోయిన్ గా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. త్వరలో దీనిపైన అధికార ప్రకటన రానుంది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో రీతూ వర్మ బాగా బిజీ అయింది.

rakul’s next 3 movies to have an OTT release!

Kajal Agarwal signs a horror flick!