in

peddi director Buchi Babu Sana going for prabhas?

ప్పెన‌’తో త‌న మార్క్ చూపించేశాడు బుచ్చిబాబు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ తో రూపొందిస్తున్న ‘పెద్ది’ సినిమాపై కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమాలోని ప్ర‌మోష‌న్ కంటెంట్ ఆక‌ట్టుకొంటోంది. ఇది ష్యూర్ షాట్ హిట్ అని ఇండ‌స్ట్రీ అప్పుడే డిసైడ్ అయిపోతోంది. మ‌రి బుచ్చిబాబు త‌దుప‌రి స్టెప్ ఎవ‌రితో..? అనే డౌటు రాక మాన‌దు. బుచ్చి క‌థ చెబుతానంటే పెద్ద హీరోలంతా విన‌డానికి రెడీనే..

ఓ ద‌శ‌లో బుచ్చిబాబు మ‌హేష్ కి ట‌చ్‌లో ఉన్నాడ‌న్న వార్త‌లొచ్చాయి. కాక‌పోతే..‘వార‌ణాసి’ త‌ర‌వాత మ‌హేష్ ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయో ఇప్పుడే ఊహించ‌లేం. అయితే బుచ్చి మ‌న‌సులో మాత్రం ప్ర‌భాస్ ఉన్నాడ‌ట‌. ప్ర‌భాస్ కి స‌రిప‌డా ఓ క‌థని బుచ్చి రెడీ చేశాడ‌ని, ప్ర‌భాస్ ని క‌లిసే అవ‌కాశం వ‌స్తే, క‌థ చెప్ప‌డం ఖాయ‌మ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఒక‌వేళ ‘పెద్ది’ హిట్ అయితే.. ప్ర‌భాస్ నుంచి పిలుపు రావడం పెద్ద క‌ష్ట‌మేం కాదు..!!

Janhvi Kapoor about the harsh reality of social media!

Raashi Khanna to do a special song for david reddy!