
ప్రస్తుతం రామ్ చరణ్ తో ‘పెద్ది’ తెరకెక్కిస్తున్నాడు బుచ్చిబాబు. ఆ తరవాత..షారుఖ్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ సెట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కూడా మైత్రీలోనే ఉండే అవకాశం ఉంది. మైత్రీ మూవీస్ షారుఖ్ తో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. సుకుమార్ సపోర్ట్ తోనే.. ఈ కథ షారుఖ్ వరకూ వెళ్లిందని, షారుఖ్ కూడా ఈ సినిమాపై ఆసక్తిని కనబరుస్తున్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి..
‘పెద్ది’ హిట్టయితే..బుచ్చితో సినిమా చేయడానికి షారుఖ్ కి ఎలాంటి అభ్యంతరాలూ ఉండకపోవొచ్చు. బుచ్చి కి కూడా `పెద్ది`తో సక్సెస్ అయితే తన కెరీర్ గ్రాఫ్ ఎలా మారిపోతుందుదో ఓ ఐడియా వుంది. అందుకే ఈ సినిమాపై గట్టిగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. బుచ్చిబాబు కథలు రూటెడ్ గానే ఉంటాయి. గ్రామీణ వాతావరణం నేపథ్యంలో సాగుతుంటాయి. షారుఖ్ కోసం కూడా అలాంటి కథే రెడీ చేశాడని సమాచారం..!!
