RX100 సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పాయల్ రాజ్ పుత్..ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. “నటులుగా కెరీర్ ప్రారంభించడం చాలా కష్టం. ప్రతిరోజూ ఏదో ఒక అనిశ్చితి వెంటాడుతూనే ఉంటుంది. బంధుప్రీతి, వివక్ష రాజ్యమేలుతున్న ఈ ప్రపంచంలో టాలెంట్ ఉన్నా నిరూపించుకోవడం కష్టంగా మారుతోంది” అని పాయల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇండస్ట్రీలో పేరున్న కుటుంబాల నుంచి వచ్చిన వారికే అవకాశాలు దక్కుతున్నాయని, టాలెంట్ ఉన్నా సరైన గుర్తింపు లభించడం లేదని ఆమె పరోక్షంగా వ్యాఖ్యానించింది. అందుకే నటులుగా ఉండడం కంటే కఠినమైన కెరీర్ మరొకటి ఉండదేమో! ప్రతి రోజూ అనిశ్చితే! ఎందుకంటే ఇక్కడ బంధుప్రీతి, పక్షపాతం అనే అంశాలు ప్రతిభను తెరమరుగు చేస్తుంటాయి” అని పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది..!!