చన్నా మేరేయా అనే పంజాబీ చిత్రం.. వీరే కి వెడ్డింగ్ వంటి బాలీవుడ్ చిత్రం తర్వాత తెలుగులోకి RX 100 చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్‌పుత్. తెలుగులో తొలి సినిమానే అయినా.. బోల్డ్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసి అందరి హృదయాలను కొల్లగొట్టింది. హీరోతో లిప్ లాక్ చేయడం.. గ్లామర్‌గా కనిపించడానికి వెనుకాడకపోవటం వంటి కారణాలతో అమ్మడుకి యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. దానికి తోడు RX 100 బ్లాక్ బస్టర్ హిట్ కావటం కూడా ఆమెకు కలిసొచ్చింది.
అయితే సక్సెస్‌ను కంటిన్యూ చేయటంలో పాయల్ తడబడింది. ఆర్డీఎక్స్ లవ్ వంటి హీరోయిన్ సెంట్రిక్ మూవీలో నటించినా.. వెంకటేష్ జతగా వెంకీ మామలో.. రవితేజ జోడీగా డిస్కోరాజాలో కనిపించినప్పటికీ ఈ అమ్మడుకి కలిసి రాలేదు. దాంతో అవకాశాలు దొరకలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ ఆహా ఓటీటీలోనూ నటించడం ప్రారంభించింది. ఇదంగా ప్రొఫెషనల్‌గా పాయల్ కెరీర్ గ్రోత్ అయితే.. పర్సనల్ విషయంలో మాత్రం ఇప్పటికే సౌరభ్ దింగ్రాతో ఈ అందాల భామ పీకలలోతు ప్రేమలో ఉంది.
ఈ విషయాన్ని వారు పలు సందర్భాల్లో ఫొటోలు, వీడియోల ద్వారా తమ రిలేషన్ ను తెలియజేస్తూనే వచ్చారు. తాజాగా మరోసారి తనకు సౌరభ్‌కు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేసింది పాయల్. తన ప్రియుడితో కలిసి ఏకంగా స్టేజ్‌పైనే వందల మంది ప్రేక్షకులు చూస్తుండగా.. ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ డాన్స్ చేసింది. డాన్స్ ముగిసిన తర్వాత సౌరభ్‌కి లిప్ లాక్ ఇచ్చి ఆడియెన్స్‌నే కాదు.. అతన్ని కూడా ఆశ్చర్యపడేలా చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.