తన బౌలింగ్ కు పేరు పెట్టని విధంగా షమీ దూసుకుపోతున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో కేవలం నాలుగు మ్యాచులే ఆడిన షమీ ఏకంగా 16 వికెట్లు సాధించాడు. హార్దిక్ పాండ్యా గాయపడటంతో షమీకి తుదిజట్టులో అవకాశం వచ్చింది. కివీస్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా ఐదు వికెట్లతో మెరిశాడు. ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ కు పెద్ద దిక్కుగా మారాడు. షమీది ప్రేమ వివాహం. పెళ్లి అయిన తర్వాత వీళ్లకు ఒక పాప కూడా పుట్టింది..
అయితే అనంతరం ఏం జరిగిందో కానీ వీరిద్దరూ విడిపోయారు. ఇది ఇలా ఉండగా….టీమిండియా బౌలర్ మహ్మద్ షమిని పెళ్లి చేసుకుంటానంటూ నటి పాయల్ గోష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ‘షమీ….నీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకో. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ’ అని ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీనిపై అతను స్పందించలేదు. పలువురు నెటిజన్లు మాత్రం ఆమెపై ఫైర్ అవుతున్నారు. ‘పెళ్లికి ఇంగ్లీషుతో పనేంటి? ఇంగ్లీష్ వస్తేనే పెళ్లి చేసుకుంటారా? ఎందుకు ఎగతాళి చేస్తున్నారు?’ అంటూ మండిపడుతున్నారు..!!