తాజాగా పవన్ రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి ఏకంగా 170 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది తెలుగులో ఇప్పటివరకు ఏ హీరో అందుకున్న అత్యధిక రెమ్యునరేషన్ కావడం గమనార్హం..
పాన్ ఇండియా స్థాయిలో కూడా చాలా మంది టాప్ హీరోలు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. దీంతో ఇప్పుడీ వార్త పవన్ అభిమానుల్లో జోష్‌ని పెంచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ ఈ ఏడాది జూలై మధ్యలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌లో పాల్గొననున్నారని సమాచారం. మొత్తం మీద సినిమాల్లో కనిపించక చాలా రోజులైనా పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!