పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ డ్రామా ‘ఓజీ’ మరో 2 వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ టీం ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్లలో బిజీగా ఉంది. అటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియా వేదికగా సర్‌ప్రైజెస్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ‘ఓజీ’కి సంబంధించి మరో బిగ్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫైర్ స్ట్రోమ్ ఓజెస్ గంభీర, సువ్వి సువ్వి లవ్ సాంగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి..
మరో సాంగ్ గన్స్ అండ్ రోజెస్ కూడా రిలీజ్ కానుంది. సినిమాలో స్పెషల్ సాంగ్ ఉందనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతున్నా తాజాగా అది కన్ఫర్మ్ అయ్యింది. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న డీజే టిల్లు బ్యూటీ ‘నేహా శెట్టి’… OGలో సర్ ప్రైజ్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. దీంతో ఆమె స్పెషల్ సాంగ్ ఉందని తెలుస్తోంది. సాంగ్‌తో పాటే పవన్‌తో కొన్ని సీన్స్‌లోనూ నటించారనే ప్రచారం సాగుతోంది. మరి దీనిపై మూవీ టీం అధికారికంగా రియాక్ట్ కావాల్సి ఉంది..!!