
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి గత ఏడాది రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఆ చిత్రాల తర్వాత తన నుంచి రాబోతున్న మరో చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. ఇక ఇది కాకుండా తన లైనప్ లో ఓజి 2 కూడా ఉంది. అయితే ఇదీ కాకుండా ఎంతో కాలం నుంచి హోల్డ్ లో ఉన్న మరో సాలిడ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అది దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఎప్పుడో అనౌన్స్ చేసిన సినిమా.
మరి ఫైనల్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ తాలూకా సాలిడ్ అప్డేట్ ని మేకర్స్ నేడు కొత్త సంవత్సరం కానుకగా అందించారు. సురేందర్ రెడ్డికి మెగా హీరోస్ కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. రేస్ గుర్రం, ధృవ అలాగే సైరా నరసింహా రెడ్డి లాంటి సాలిడ్ హిట్స్ తాను అందించగా ఈ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ తో తాను పని చేసే ఛాన్స్ అందుకున్నారు. అందుకే ఈ కలయికపై మంచి హైప్ ఉంది. మరి మేకర్స్ ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి. ఇక ఈ సినిమాకి వక్కంతం వంశీ కథ అందిస్తుండగా రామ్ తాళ్లూరి నిర్మాణం వహిస్తున్నారు..!!
