రీమేక్ అంటే ముందు మనకు వెంకటేష్‌నే గుర్తొస్తాడు. తన కెరీర్‌లో సగం రీమేకులే. ఈమధ్య వచ్చిన `నారప్ప`.. త్వరలో రాబోతున్న `దృశ్యమ్ 2` ఇవి కూడా రీమేకులే. టాలీవుడ్ లో వెంకీలా రీమేక్ సినిమాల్ని నమ్ముకున్న మరో హీరో లేడనుకుంటాం. కానీ ఈ విషయంలో పవన్ కల్యాణ్ సైలెంట్ గా వెంకీనే దాటేశాడు. అవును… ఇప్పటి వరకూ పవన్ చేసిన సినిమాలు 26. అందులో సగం రీమేకులే అంటే నమ్ముతారా? పవన్ తొలి చిత్రం `అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి`.
pawan kalyan did more remakes than venkatesh!
ఈ సినిమాకి ఈవీవీ సత్యనారాయణ దర్శకుడు. ఇది ఓ రీమేక్ అని తెలుసా? బాలీవుడ్ హిట్ చిత్రం `ఖయామత్ సే ఖయామత్ తక్` సినిమాకి ఇది రీమేక్. ఆ తరవాత చేసిన గోకులంలో సీత `ఇండియా టుడే` అనే చిత్రానికి రీమేక్. తమ్ముడు, ఖుషి, సుస్వాగతం, అన్నవరం, తీన్‌మార్, గబ్బర్ సింగ్, గోపాల గోపాల, కాటమరాయుడు, వకీల్ సాబ్.. ఇవన్నీ రీమేకులే. ఇప్పుడు చేస్తున్న భీమ్లా నాయక్ కూడా రీమేక్ అనే సంగతి తెలిసిందే. అలా ఇప్పటి వరకూ మొత్తంగా 13 సినిమాల్ని రీమేక్ చేశాడు పవన్. అయితే.. కొన్ని సినిమాలు మాతృక కంటే తెలుగులోనే బాగా ఆడాయి. దానికి కారణం.. పవన్ స్టైల్. ఇమేజ్.