మిట్టపల్లి సురేందర్ అనే ,సినీ గేయ రచయిత ను ప్రభావితం చేసి పూర్తి స్థాయి గేయ రచయిత గ మార్చిన సిరివెన్నెల సీతారామ శాస్ట్రీ గారి పాట.” అనగనగ ఒక రోజు” చిత్రం కోసం సిరివెన్నెల గారు వ్రాసిన ” క్లాస్ రూంలో తపస్సు చేయుట వేస్టురా గురు” అనే పాట విని ప్రభావితం అయిన సురేందర్ తాను కూడా పూర్తి స్థాయి గేయ రచయిత గ పరిణితి చెందారు. మిట్టపల్లి సురేందర్ 9 వ తరగతి ఫెయిల్ అయి, వీడు దేనికి పనికి రాడు అని ముద్ర పడి, పొలం పనులు చేసుకుంటూ తనలోని తృష్ణను గేయాలుగా వ్రాసుకొని ఎవరికంటా పడకుండా దాచుకొని తానే చదువుకొని ఆనందిస్తున్న రోజులు, సిరివెన్నెల గారి పాట వినటం జరిగింది, ఆ పాట శాస్ట్రీ గారు తన కోసమే వ్రాసారేమో అనిపించింది. క్లాస్ రూమ్ లో తపస్సు చేయటం వేస్టు, బయట ఉన్నది ప్రపంచమన్నది అనుకున్నాడు.
తాను చదువొకోలేకపోయానే అనే ఆత్మ న్యూనత భావం నుంచి బయట పడి పాటలు వ్రాయటం మొదలు పెట్టాడు. అప్పట్లో జరిగిన ఒక ఎన్కౌంటర్ కి కదలిపోయిన సురేందర్ ” రాతి బొమ్మలోనే కొలువయినా శివుడా ” అనే పాటను వ్రాసారు ఆ పాటను నారాయణ మూర్తి గారు “పోరు తెలంగాణ” అనే చిత్రం లో వాడుకున్నారు, అదే పాటకు 2011 లో , సురేందర్ కి నంది అవార్డు వచ్చింది. ఆ తరువాత నాన్ స్టాప్, ధైర్యం, రాజన్న, సత్యాగ్రహి, జార్జి రెడ్డి వంటి చిత్రాలలో పాటలో వ్రాసి ప్రముఖుల, ప్రేక్షకుల చేత సెహబాష్ అనిపించుకున్నారు. తెలంగాణ ఉద్యమ పాటలకు ఊపిరి పోసిన పల్లె కవి, సినీ గేయ రచయిత గ కూడా అందరి మన్ననలు పొందుతున్నారు మిట్టపల్లి సురేందర్..