ప్రసిద్ధ గాయని సుశీల గారు దక్షిణ భారతీయ భాషలు అన్నింటిలోనూ పాటలు పాడారు. అటువంటి సుశీల గారు ఒక సారి ఒక పాట రికార్డింగ్ కు వచ్చి పాడకుండానే వెళ్లిపోయారు. అది ఎవరి మీదో కోపం తో కాదు, సహా గాయని పట్ల ఆమెకు ఉన్న గౌరవం వలన ఆలా చేసారు. ఒక తమిళ పాట రికార్డింగ్ కోసం స్టూడియో కి వచ్చిన సుశీల గారు పాట ఏమిటని అడగగా సుశీల గారు గురువు గ పాట నేర్పిస్తుంటే ఇంకొక గాయని శిష్యురాలిగా పాడుతుంది అని చెప్పారట . ఎవరా గాయని అని అడగగానే ఏ.పి. కోమల గారి పేరు చెప్పారట,
ఆ విషయం వినిన సుశీల గారు కోమల గారు కర్ణాటక సంగీతం లో నిష్ణాతురాలు అటువంటి గాయని కి గురువు గ నేను పాడితే నాకు శిష్యురాలిగా ఆవిడ చేత పాడిస్తారా, ఏమయినా అర్ధం ఉండాలండి. ఆవిడ గురువుగా పాడితే, నేను శిష్యురాలిగా పాడతానేమో గాని, ఇలాగయితే నేను పాడను అని సున్నితంగా చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారట. అది ఆవిడకు సహా గాయనీమణుల మీద ఉన్న గౌరవం, విద్వత్తుకు సుశీల గారు ఇచ్చిన గౌరవం.