in

ott platform gives red signal to ram’s movie?

ప్రస్తుతం ఉన్న కరోనా కారణంగా సినిమా థియేటర్స్ అన్ని మూతపడ్డాయి. దాంతో విడుదల కావాల్సిన సినిమాలు అన్ని ఓటీటీ దారిలో పడ్డాయి. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ప్రేక్షులను ఆకట్టుకున్నాడు హీరో రామ్. ఈ సినిమా తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ సినిమాని చేస్తున్నాడు. నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రామ్ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే కరోనా కారణంగా చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టడంతో రామ్ మూవీకి కూడా ఓటీటీలు ఫ్యాన్సీ రేట్స్ ని ఆఫర్ చేసాయి.

కానీ అప్పుడు దర్శకనిర్మాతలు ఈ సినిమాను థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే తాజా సమాచారం ప్రకారం… థియేటర్స్ ఇప్పుడప్పుడే తెరుచుకోవడం కష్టం అనుకున్న చిత్రబృందం సినిమాను డిజిటల్ గా విడుదల చేద్దాం అనుకోని ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కు ఓకే చెప్పిందంట! కానీ ఇప్పుడు ఆ ఓటీటీ సంస్థ రామ్ సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఓటీటీ లో విడుదలైన పెంగ్విన్, వి సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో వారు రెడ్ సినిమాకు నో చెప్పారని తెలుస్తుంది.

hero nikhil turns into director!

payal buying new house in hyderabad?