in

omg, bollywood beauty Janhvi Kapoor recalls feeling paralysed!

ఫుడ్ పాయిజనింగ్ వల్ల జాన్వీ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన విషయాన్ని తన తండ్రి బోనీ కపూర్ స్వయంగా ప్రకటించ‌గా, తన ఫుడ్ పాయిజనింగ్‌కు సంబంధించిన వివరాలను బయటపెట్టింది. తాను కొంత కాలంగా వ‌రుస షూటింగ్స్, ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో ప‌లు ప్రయాణాలు చేయాల్సి వ‌చ్చింది. అయితే అలా ప్ర‌యాణాలు చేయ‌డం వ‌ల‌న వీక్ అయ్యాను అని జాన్వీ తెలిపింది. ఒక పాట షూటింగ్ కోసం తాను చెన్నై వెళ్లానని, అక్కడికి వెళ్లినప్పుడు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల కడుపులో నొప్పి మొదలయ్యిందని తెలిపింది జాన్వీ కపూర్.

బయట తినడం వల్ల మొదట కడుపులో నొప్పిగా అనిపించినా మెల్లగా దాని వల్ల నీరసం కూడా వ‌చ్చింది.అనంత‌రం భరించలేనంత నొప్పి, వణుకు రావడంతో అసలు తనకు ఏమైందో అని అర్ధం కాక భ‌యమేసింది.ఇక చెన్నై నుండి హైదరాబాద్‌కు ఫ్లైట్ ఎక్కే ముందు తన పరిస్థితి చూసి పక్షవాతం వచ్చిందేమో అని సందేహ‌ప‌డ్డానంటూ జాన్వీ పేర్కొంది. సాయం లేకుండా వాష్ రూమ్‌కి కూడా వెళ్లేలేక‌పోయాను. క‌నీసం న‌డ‌వ‌డానికి కూడా ఓపిక లేక‌పోవ‌డంతో ఎలాగోలా ఆసుప‌త్రికి వెళ్లి మూడు రోజులు అక్కడ చికిత్స తీసుకున్నానని అసలు విషయాన్ని వివరించింది జాన్వీ కపూర్..!!

Most awaited sequels of blockbuster hit films in Tollywood!

Choreographer Bosco Martis says Jr NTR is a fabulous dancer!