ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను” ఇది పోకిరి సినిమా లో డైలాగు అని అందరికి తెలుసు, కానీ నిజ జీవితం లో దానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ క్యారెక్టర్. ఆయన తన కెరీర్ తోలి రోజుల్లో ఒక పాటలో సెట్టింగ్ కోసం తన సగం రెమ్యూనరేషన్ వదులుకొని సెట్టింగ్ వేయించారు, అయన ఆ పాట ప్రాముఖ్యతను ముందుగానే పసిగట్టారు, కాబట్టి తన సగం రెమ్యూనరేషన్ వదులుకోవడానికి కూడా సిద్ద పడ్డారు. జి.వి.జి.రాజు నిర్మాత గ, కరుణాకరన్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ నటించిన “తోలి ప్రేమ” చిత్రంలో జరిగిన సంఘటన ఇది. “గగనానికి ఉదయం ఒకటే, కెరటాలకు సంద్రం ఒకటే ” అనే పాట చిత్రీకరణ సందర్భం లో డైరెక్టర్, తాజ్ మహల్ సెట్ వేస్తే బాగుంటుంది అనుకోని నిర్మాతకు చెప్పారు,
అంత బడ్జెట్ లేదని నిర్మాత చెప్పేసారు, ఆ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు తన రెమ్యూనరేషన్ సగం తగ్గించుకొని ఆ సెట్టింగ్ వేయించారు. సినిమా చూసిన వారందరికీ తెలుసు ఆ సెట్టింగ్ వలన ఆ పాటకు ఎంత నిండుతనం వచ్చిందో. పవన్ కళ్యాణ్ కెరీర్ ని ఒక మలుపు తిప్పిన చిత్రం “తోలి ప్రేమ” , జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక అయింది, ఆరు నంది అవార్డులు గెలుచుకుంది, ప్రేక్షకుల ఆదరణ ఏ స్థాయి లో పొందింది అంటే, ఏకంగా 365 రోజులు ప్రదర్శితం అయి రికార్డుల్లోకి ఎక్కింది. ఈ చిత్రం తరువాత నుంచి పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ ను ఫాలో అవటం మానేసి ట్రెండ్ సెట్టర్ గ మారారు.