
19 సంవత్సరాలకు సిరమిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని, ఉద్యోగం చేద్దామని బయలుదేరితే వయసు సరిపోదు అని వెనకకు పంపించేస్తే ,సినిమా రంగం పై ఆసక్తి కలిగిన ఒక బక్క పలచటి కుర్రాడు మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరాడు. మైమ్ అండ్ మూవ్మెంట్ అనే ప్రక్రియ లో గోల్డ్ మెడల్ సాధించాడు, నందమూరి తారక రాముడి చేత సెహబాష్ అనిపించు కున్నాడు, ఇంతకీ ఎవడు ఆ కుర్రాడు అనగా, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ , మొదట్లో ఈ కిరీటానికి తలా దొరకలేదు,అంటే వేషాలు దక్క లేదు.వేషాల కోసం సిఫార్సు చేయమని తనకు తెలిసిన సినిమా పెద్దలను అడగటానికి అభిమానం అడ్డుఛ్చి ,ముప్పై రోజులు పస్తులు ఉన్నాడు. చివరకు నిర్మాత పుండరీకాక్షయ్య గారి ఇంటికి వెళ్లారు రాజేంద్ర ప్రసాద్ , అప్పటికే పుండరీకాక్షయ్య గారు మేలుకొలుపు అనే సినిమా తీసి ఉన్నారు, అయన వెళ్లిన టైం కు, పెద్ద చర్చ జరుగుతున్నది , ఆ సినిమా లో నటించిన రాజా కృష్ణ పదిహేను సంవత్సరాల కుర్రాడు.అతనికి డబ్బింగ్ చెప్పడానికిసరిపోయే వాయిస్ దొరకక క్రింద మీద పడుతున్నారు, అప్పుడే బయటకు వచ్చిన పుండరీకాక్షయ్య గారు రాజేంద్ర ప్రసాద్ ను చూడగానే పెద్ద రిలీఫ్ ఫీల్ అయ్యారు.రాజేంద్ర ప్రసాద్ ను కార్ లో డబ్బింగ్ థియేటర్ కు తీసుకొని వెళ్లి, డైలాగ్ పేపర్ చేతికి ఇచ్చి డైలాగ్స్ చెప్పమన్నాడు ముప్పై రోజుల ఆకలి కడుపుతో అతి కష్టం మీద డైలాగ్స్ చెప్పిన రాజేంద్రుడి పరిస్థితి ఏమిటో ఆలోచించండి. అందరు సంతోషం,వాయిస్ మ్యాచ్ అయి నందుకు, మిగతా డైలాగ్స్ కూడా కంటిన్యూ చేయమనగానే మన రాజేంద్ర ప్రసాద్ , భోజనం పెట్టించండి మిగతా డైలాగ్స్ చెప్పాలి అంటే నీరసం గ ఉన్నది అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కంట నీరు చిమ్మింది, పుండరీకాక్షయ్య గారు తన వద్ద కు ఎందుకు రాలేదు అని మందలించి, భోజనం తెప్పించారు. అది మొదలు రాజేంద్ర ప్రసాద్ గారు డబ్బింగ్ ఆర్టిస్టు గ బిజీ అయిపోయారు. మోహన్, రాంకీ వంటి తమిళ హీరో లకు తెలుగు డబ్బింగ్ మన రాజేంద్రుడే చెప్పింది, మణిరత్నం గారి మౌన రాగం సినిమా లో మోహన్ కు డబ్బింగ్ చెప్పింది రాజేంద్రుడే. డబ్బింగ్ ఆర్టిస్టు గ సొంతగా ఇల్లు కట్టుకొనే లెవెల్ లో సంపాదించిన తరువాతే మన వాడికి నటించే అవకాశం దక్కినది.ఇందు మూలముగా తెలియ చేయునది ఏమనగా సినిమా కష్టాలకు ఎవరు అతీతం కాదు అని. డబ్బింగ్ ఆర్టిస్టు గ ఉన్న రోజ్జుల్లో నే వంశి తో పరిచయం, ఆ పరిచయ పర్యవసానమే లేడీస్ టైలర్ సినిమా, పూర్తి స్థాయి కామెడీ సినిమా కూడా జనరంజకం గ తీయ వచ్చు అని నిరూపించిన సినిమా లేడీస్ టైలర్, ఈ తరువాత రాజేంద్ర ప్రసాద్ వెనకకు తిరిగి చూడ వలసిన అవసరం రాలే.

