ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము ” ఇది పాత కాలపు పాపులర్ సినిమా పాట, దీనికి సరిగ్గా సరిపోయే ఒక సంఘటన చాల సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో చోటు చేసుకుంది.” దేవదాసు ” చిత్రంలో చంద్రముఖి పాత్రలో నటించిన లలిత అందగత్తె మాత్రమే కాదు, మంచి నర్తకి కూడా. ఆమె అందానికి నాట్యానికి ఫిదా అయిన దేవదాసు చిత్ర నిర్మాత డి.ఎల్.నారాయణ గారు ఆమె మీద మనసు పారేసుకున్నారు, అప్పటి వరకు తమిళ చిత్రాలకే పరిమితం అయిన ఆమెను దేవదాసు చిత్రంలో చంద్రముఖి పాత్రకు తీసుకున్నారు. దేవదాసు చిత్రానికి సంగీత దర్శకుడు అయిన సుబ్బరామన్ లలిత గారిని చూడగానే ” లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ” “కలవరమాయే మదిలో” అంటూ ఆమెకు ప్రపోజ్ చేసే ప్రయత్నం చేసారు..
మంచి మాటకారి, అందగాడు, సంగీత దర్శకుడు అయినందున లలిత గారు కూడా అతనితో క్లోజ్ గ ఉండటం మొదలు పెట్టారు. ఇది గమనించిన నిర్మాత నారాయణ గారు బహిరంగంగానే సుబ్బరామన్ తో గొడవకు దిగారు, చాలా సారులు వార్నింగ్ ఇచ్చారు, అయిన సుబ్బరామన్ లెక్క చేయలేదు. హఠాత్తుగా సుబ్బరామన్ మరణించారు, కారణాలు తెలియవు. 35 సంవత్సరాల వయసు లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని సుబ్బరామన్ హఠాన్మరణం, అందరు నారాయణ గారి వైపు అనుమానంగా చూసేట్లు చేసింది. ఉజ్వలమయిన భవిష్యత్తు ఉన్న అమోఘమయిన సంగీత దర్శకుడు ఇలా మరణించటం అందరిని ఆశ్ఛర్య పరచింది. సుబ్బరామన్ మరణ రహస్యం ఈశ్వరుడికి ఎరుక.