భారత సినీ రంగ చరిత్రలో ఒక నటుడు, ఒక గాయకుడికి ప్లేబాక్ సింగర్ గ పాటలు పాడటం గురించి మీరు విన్నారా? వినకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చదవండి, 1991 లో తెలుగులో వచ్చిన” మామగారు ” సినిమా ను కన్నడలో ” ముద్దిన మావ ” అని 1993 లో నిర్మించారు, తెలుగులో దాసరి గారు పోషించిన మామగారి పాత్రను, కన్నడ లో గాయకుడు బాలు గారు పోషించారు ఆ చిత్రం లో బాలు గారికి కూడా రెండు పాటలు ఉన్నాయి, కాబట్టి హీరో కి, తనకు , తానే పాడటం బాగుండదు అని, హీరో అయిన శశి కుమార్ కి వేరే సింగర్ తో పాడించమన్నారు బాలు గారు. దానికి శశి కుమార్ ససేమిరా ఒప్పుకోక పోవడం తో, మరి తన పాటలు ఎవరితో పాడించటం అని ఆలోచించిన బాలు గారు, కన్నడ కంఠీరవ, డాక్టర్ రాజ్ కుమార్ గారిని అడగటం జరిగింది। స్వతహాగా శాస్త్రీయ గాయకుడైన రాజ్ కుమార్ గారు మొదట ఒప్పుకోలేదు. కానీ తాను ట్రాక్ పాడిన క్యాసెట్ ను వారికీ ఇచ్చి, మీరు పాడవలసిందే అని చెప్పి వెళ్లిపోయారు బాలు గారు, అయన మాటను తీసివేయలేని రాజ్ కుమార్ గారు ఆ చిత్రం లో బాలు గారికి “దీపావళి దీపావళి”, ” శివనే” అనే రెండు పాటలు పాడటం జరిగింది. నిజం గ ఇది చాలా అరుదైన సంఘటన , నటులు పాటలు పాడటం, గాయకులు నటించటం చూసి ఉంటాం, కానీ ఒక దిగ్గజ నటుడు, మరొక దిగ్గజ గాయకుడికి పాటలు పాడటం అనేది చాల అరుదైన మహత్థరమయిన సంఘటన అనే చెప్పవచ్చు।