ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ మూవీ షూటింగ్‌పై తాజాగా ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో జరగడం రాష్ట్రానికి గర్వకారణమని, ఇది స్థానిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు రాష్ట్రాన్ని సినిమా షూటింగ్‌లకు ఆకర్షణీయ కేంద్రంగా మారుస్తుందని ఆమె ట్వీట్ చేశారు. “గతంలో మల్కాన్‌గిరిలో ‘పుష్ప-2’ షూటింగ్ జరిగినట్లే..
ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోయే చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ 29’ కోసం కోరాపుట్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటి ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఇది ఒడిశా పర్యాటక రంగానికి మంచి అవకాశం లాంటింది. ఈ చిత్ర షూటింగ్ వల్ల భవిష్యత్‌లో ఒడిశా సినిమా షూటింగ్‌లతో పాటు పర్యాటకరంగానికి ఒక గొప్ప గమ్యస్థానంగా మారుతుంది..!!