NTR రెండు వందవ చిత్రం , ” కోడలు దిద్దిన కాపురం” బాన్ చేస్తామని మొండికేసిన సెన్సార్ వారు. చిత్రం కధ మొత్తం పెద్ద కోడలు అయిన సావిత్రి గారి చుట్టే తిరుగుతుంది, డబ్బుంటే సరిపోదు, పిల్లలకు సంస్కారం నేర్పాలి లేకుంటే వారి జీవితాలు సర్వ నాశనం అవుతాయి, అని చెప్పే చిత్రం ఇది. స్వతహాగా యెన్.టి.ఆర్. తన సొంత బ్యానర్ లో నిర్మించే చిత్రాలలో ఏదో ఒక సామాజిక అంశాన్ని జోడించి చిత్రం తీయటం ఆనవాయితీ. అలాగే ఈ చిత్రంలో కూడా ఒక ధనువంతులయిన కుటుంబం లో క్రమశిక్షణ లేక ఎలా చెడిపోయారు, వారిని సరిద్దిదటం కోసం వదిన సహకారం తో హీరో ప్రయత్నించటం ఈ చిత్రం ఇతివృత్తం.
ఈ క్రమం లో మూఢ భక్తురాలయిన హీరో తల్లి ఒక దొంగ బాబా చేతిలో ఎలా మోసపోయిందో చూపిస్తారు ఇందులో. ఆ బాబా ఆహార్యం, ఆకారం మొత్తం పుట్టపర్తి సాయి బాబాను పోలి ఉందని, జీవితుడయిన ఒక వ్యక్తి ని ఆ విధం గ వ్యంగ్యంగా చూపించటానికి తాము వ్యతిరేకమని కొంతమంది సాయి బాబా భక్తులు అయిన సెన్సార్ బోర్డు మెంబెర్ లు ఏకంగా ఏ చిత్రాన్ని బాన్ చేయాలనీ నిర్ణయించారు. దానికి అంగకరించని యెన్.టి.ఆర్. బొంబాయి లోని సెన్సార్ రేవైసింగ్ కమిటి కి వెళ్లి ఆ చిత్రానికి క్లీన్ సర్టిఫికెట్ తెచ్చుకొని చిత్రాన్ని రిలీజ్ చేసారు. చిత్రం రిలీజ్ తరువాత కూడా చాల విమర్శలు వచ్చాయి, కానీ చిత్రంలో ఒక చక్కటి మెసేజ్ ఉండటం తో విజయవంతం అయింది.