ఇండస్ట్రీలో సహజంగా స్టార్ హీరోలందరితో పనిచేయాలని దర్శకులు అనుకుంటారు అది ఓ డ్రీమ్ కూడా.. ఇక ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడానికి స్టార్ దర్శకుల నుంచి కుర్ర డైరెక్టర్‌లు పోటీపడేవారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఓ స్టార్ డైరెక్టర్‌తో చేద్దామని రెండు సార్లు పిలిచి మరి ఆఫర్ ఇస్తే రెండు సార్లు రిజెక్ట్ చేశారట ఆ దర్శకుడు.. ఆ దర్శకుడు ఎవరో కాదు కోదండరామిరెడ్డి. అవును.. అన్న ఎన్టీఆర్.. కోదండరామిరెడ్డితో సినిమా చేయాలనీ అనుకున్నారట. అందులో భాగంగానే ఇంటికి పిలిచి మరి ఆఫర్ ఇచ్చారట. ముందుగా తమిళంలో శివాజీ గణేశన్ చేసిన ఒక సినిమాను తెలుగులో చేయమని ఎన్టీఆర్ అడిగితే..
తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథను మార్చడానికి చాలా సమయం పడుతుందని ఆ సినిమాని పక్కన పెట్టినట్టుగా కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇక మరోసారి మరో సినిమా చేసే అవకాశం వస్తే తానూ మరో సినిమాల ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండడంతో ఆ సినిమాని చేయలేకపోయానని అన్నారు. ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయలేకపోయినప్పటికి ఎన్టీఆర్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘సింహ బలుడు’ సినిమాను రెండో యూనిట్ దర్శకుడిగా ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేసే అవకాశం మాత్రం వచ్చినట్టుగా వెల్లడించారు. కనీసం ఆ తృప్తి అయిన తనకి మిగిలిందని కోదండరామిరెడ్డి వెల్లడించారు..