
కోదండరామి రెడ్డి 93 సినిమాల డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీ లో మూడు తరాల నటులను డైరెక్ట్ చేసిన డైరెక్టర్, కానీ నందమూరి తారక రామ రావు గారిని డైరెక్ట్ చేసే ఆకాశం మిస్ అయ్యారు, 93 సినిమాలలో దాదాపు 80 సినిమా లు హిట్, రామ రావు గారు రాజయకీయ ప్రవేశానికి ముందు, కోదండరామి రెడ్డి గారిని పిలిచి, బ్రదర్ మనం ఒక సినిమా చేద్దాం అన్నారట, ఎగిరి గంతేసిన రెడ్డి గారు స్టోరీ అన్వేషణ లో పడ్డారు, తమిళ్ లో శివాజీ గారు నటించిన “గౌరవం” అనే సినిమా స్టోరీ రామ రావు గారికి చెప్పటం, వారికీ నచ్చటం జరిగిపోయింది. తెలుగు నేటివిటీ కి దగ్గరగా స్టోరీ ని చేంజ్ చేయటానికి రెండు నెలలు పడుతుంది అని చెప్పారట రెడ్డి గారు, కానీ అంత టైం లేదు బ్రదర్ మనం రాజయకీయ ప్రవేశం చేస్తున్నాం కాస్త త్వరగా కానివ్వండి అన్నారట అన్న గారు. కానీ కోదండరామి రెడ్డి గారు అప్పట్లో చాలా బిజీ డైరెక్టర్, త్వరగా స్టోరీ చేంజెస్ చేయటానికి విశ్వప్రయత్నం చేశారట రెడ్డి గారు, కానీ అనుకున్న టైం లో స్టోరీ రెడీ చేయలేక పోయారు, పాపం కోదండ రామి రెడ్డి గారు ఆలా లెజెండరీ యాక్టర్ రామ రావు గారిని డైరెక్ట్ చేసే అవకాశం కోల్పోయారు.

