in

NTR, Neel Lucky Escape from Jordan tensed situations!

ప్రస్తుతం అంతర్జాతీయంగా యూఎస్-ఇజ్రాయెల్ వార్ హాట్ టాపిక్‌గా మారింది. మిడిల్ ఈస్ట్‌పై ఈ యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. ఇజ్రాయెల్ వార్ కారణంగా పలు దేశాలు అప్రమత్తం అయ్యాయి. అందులో జోర్డాన్ కూడా ఒకటి. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా జోర్డాన్‌లోని ఇండియన్ అధికారులు అక్కడున్న భారతీయ టూరిస్టులు, ఇండియన్ పౌరులకు హెచ్చరికలు జారీ చేశారు..

అయితే, ఇటీవల జోర్డాన్ దేశంలో కీలక షూటింగ్ కోసం ఎన్టీఆర్-నీల్ టీమ్ అక్కడికి వెళ్లింది. భారీ షెడ్యూల్‌ను అక్కడ షూట్ చేశారు. అయితే, లక్కీగా ఇటీవల వారు అక్కడ షూటింగ్ ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. ఇప్పటివరకు అక్కడే ఉండి ఉంటే ఎన్టీఆర్-నీల్ టీమ్ జోర్డాన్‌లో చిక్కుకుపోయే వారు. కానీ, అదృష్టవశాత్తు వారు అక్కడ షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఇక జోర్డాన్‌లో రెండు యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ఓ సాంగ్ షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది..!!

Devi Sri Prasad’s Remuneration Shocks Tollywood!