యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో దీపావళి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన పిల్లలతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు తారక్. అయితే ఈ ఫొటోలో తారక్ చేతికి గాయం అయినట్టు కనిపిస్తుంది. దాంతో అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు. అసలు విషయం ఏంటంటే ఇటీవల తన ఇంటి జిమ్‌లో వ్యాయామాలు చేస్తూ ఎన్టీఆర్ గాయపడ్డారు.
వర్కౌట్స్ చేస్తుండగా ఎన్టీఆర్ కుడి చేతి వేలుకు గాయం అయ్యింది..ఎన్టీఆర్ కుడి చేతి వేలుకు నాలుగు రోజుల క్రితం వైద్యులు మైనర్ సర్జరీ చేశారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తారక్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు యంగ్ టైగర్. ఈ సినిమాలో కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమా రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు తారక్ ఈ సినిమా షూటింగ్ మరో నెలరోజుల్లో ప్రారంభం కానుంది.