in

Not allu arjun But Nithiin To Become ‘Icon’ ?

ల్లు అర్జున్‌తో అనుకున్న ‘ఐకాన్’ ఎటూ తేలకుండా పోయింది. ఇంకే స్టార్ హీరో కూడా దొరకలేదు. చివరికి నితిన్‌తో సంప్రదింపులు జరిగాయి. అతడితోనే సినిమా ఓకే అయింది. దీంతో పవన్ తర్వాత పవన్ ఫ్యాన్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు వేణు. వీరి కలయికలో ఒక యాక్షన్ డ్రామా రాబోతోందట. కొంచెం పెద్ద బడ్జెట్లోనే సినిమా ఉంటుందట.

ఎప్పట్లాగే వేణు కొత్త సినిమాను కూడా దిల్ రాజే ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. నితిన్‌తో ‘దిల్’ లాంటి బ్లాక్ బస్టర్, ‘శ్రీనివాస కళ్యాణం’ లాంటి డిజాస్టర్ తీశాడు రాజు. ఇప్పుడు వీరి కలయికలో మూడో సినిమా రాబోతోంది. ప్రస్తుతం నితిన్.. వక్కంతం వంశీ డైరెక్షన్లో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ చేస్తున్నాడు. దాని చిత్రీకరణ చివరి దశలో ఉంది. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. దీనికి సంబంధించి తన పని పూర్తయ్యాక వేణు సినిమాను పట్టాలెక్కిస్తాడు నితిన్..!!

Agent beauty Sakshi Vaidya grabs Ustaad Bhagat Singh!

Kriti Kharbanda reveals she found hidden camera in her hotel room!