
చింత నిప్పులు వంటి కళ్ళు, చిరుత చూపుల జీవ,తన కళ్ల తో ప్రముఖ తమిళ దర్శకుడు బాలచందర్ గారి దృష్టి ని ఆకర్షించి సినిమా ఛాన్స్ పట్టేశారుస్క్రీన్ టెస్ట్ కోసం ఒక త్రాగుబోతు గ నటించి చూపించమన్నారు,అతి ఉత్సాహానికి గురి అయిన జీవ గారు క్యారెక్టర్ ఎక్కువ త్రాగినదా, లేక తక్కువ త్రాగినదా అని అడిగి దిరికిపోయారు.బాలచందర్ రెండు చేసి చూపించ మని చెప్పారు. రెండు పాత్రలను చేసి చూపించారు జీవ గారు, జీవ గారి పంట పండింది, బాలచందర్ గారు మెచ్చుఁకొని, తొలి కోడి కూసింది తెలుగు, తమిళ చిత్రం లో మెయిన్ విలన్ క్యారెక్టర్ కి జీవ గారి ని ఫైనలైజ్ చేసారు.మొదటి రోజు షూటింగ్ పూర్తి అయిన తరువాత బాలచందర్ గారు, జీవ గారి పేరు అడిగారు, జీవ గారి అసలు పేరు దయ రత్నం, ఒక పెన్, పేపర్ తీసుకొన్న బాలచందర్ గారు, జీవ అని వ్రాసి ఈ రోజు నుంచి నీ పేరు ఇది అని చెప్పారు. ప్రక్క నే ఉన్న రైటర్ గణేష్ పాత్రో గారు, అర్ధం అడిగారు, మన మూవీ లో ఇతనిది మెయిన్ రోల్, ఈ సినిమా కి జీవం ఇతనే, అందుకే ఇతనికి జీవ అని పేరు పెడుతున్నాను అని చెప్పారు.ఆ విధంగా దయ రత్నం, జీవ గ మారి తన సినీ జీవితం ప్రారంభించి, తనకు వచ్చిన కేరక్టర్స్ లో జీవిస్తూ తనకు బాలచందర్ గారు పెట్టిన పేరు ను సార్ధకం చేసుకొంటున్నారు.మొదట్లో నెగటివ్ రోల్స్ చేసిన, తరువాతి రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు గ, కమెడియన్ గ రాణిస్తున్నారు.

