ఇంతకీ నోరా, జాక్వెలిన్ పై కేసు ఎందుకు నమోదు చేసిందంటే.. సుఖేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ విచారణ కొనసాగింది. ఇందులో నిందితురాలిగా ఉన్న జాక్వెలిన్ ను కూడా విచారించారు. ఎంక్వయిరీలో భాగంగా కీలక విషయాల వెల్లడించింది. సుఖేష్ కు తనతో పాటు చాలా మంది బాలీవుడ్ నటీమణులకు సంబంధాలు ఉన్నాయని చెప్పింది. అందులో నోరా ఫతేహి చాలా ముఖ్యమైన ఫ్రెండ్ అని చెప్పింది. ఈడీ విచారణలో తన పేరును ప్రస్తావించడం పట్ల జాక్వెలిన్ పై నోరా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
సంబంధం లేని కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్లు మండిపడింది. జాక్వెలిన్ తో పాటు తన గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేసిన పలు వార్తా చానెళ్లపై పరువు నష్టం కేసు వేసింది. కొంతమంది తనను కావాలని మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించింది. తనకు సుఖేష్ తో ఎలాంటి స్నేహం లేదని మరోసారి తేల్చి చెప్పింది. ఇప్పటికే నోరా నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్వరలో ఆమెను విచారించి, చర్యలు తీసుకునే అవకాశం ఉంది..!!