రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు తన కెరీర్ ప్రారంభ దశలో, ఒక 555 సిగరెట్ ప్యాకెట్ కారణంగా ఫస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ పోగొట్టుకున్నారు. అది ‘వీరాభిమన్యు’ చిత్రంలో అభిమన్యుడు పాత్ర కోసం వేట జరుగుతున్న రోజులు, ఆ రోల్ కోసం ఒక కొత్త నటుడిని తీసుకోవాలని డూండి గారు ప్రయత్నిస్తున్న రోజుల్లో, కృష్ణం రాజు గారు నిర్మాత డూండీ గారి దృష్టిలో పడ్డారు, వెంటనే కృష్ణం రాజు గారిని పిలిచి, డైరెక్టర్ వి.మధుసుహాఫన రావు గారిని కలవమని చెప్పారు. డైరెక్టర్ గారి ఆఫీస్ కి వెళ్లిన కృష్ణం రాజు గారు అయన లేక పోవటంతో బయటకు వచ్చి ఒక 555 సిగరెట్ కాల్చి, మళ్లీ లోపలి కి వెళ్లి కూర్చున్నారు, అప్పటికి మధుసూధన రావు గారు రాక పోవటం తో, బయటకు వచ్చి వరండాలో తచ్చాడుతూ ఉన్నారు, అప్పుడు వచ్చారు డైరెక్టర్ గారు, అయన వేగం గ లోపలి వెళ్లిపోయారు, రూంలోకి వెళ్లిన మధుసూధన రావు గారు టేబుల్ పైన ఉన్న సిగరెట్ పాకెట్ చూసారు, కృష్ణం రాజు గారిని లోపలి పిలిచిన మధుధాన రావు గారు..
ఈ సిగరెట్ ప్యాకెట్ నీదేనా అని అడిగారట, అవును సర్ అంటూ, స్టైల్ గ దానిని తీసి జేబులో పెట్టుకున్నారట కృష్ణం రాజు గారు. నాకు సిగరెట్ తాగే వారంటే పడదు, నిన్ను తీసుకుంటే నువ్వు షూటింగ్ టైంలో సిగరెట్ కాలుస్తావు, నేను నిన్ను అరవటం, నువ్వు బాధ పడటం ఇదంతా ఎందుకు చెప్పు, ఇక నువ్వు వేళ్ళ వచ్చు అని ఖరాఖండిగా చెప్పేశారట” అపర దూర్వాసుడు” అని పేరున్న మధుసూదన్ రావు గారు. మౌనంగా అక్కడ నుంచి వెళ్లిపోయారట కృష్ణం రాజు గారు, బై మిస్టేక్, తాను టేబుల్ మీద వదిలిన సిగరెట్ ప్యాకెట్ ఎంత పని చేసింది అని బాధ పడ్డారట కృష్ణం రాజు గారు.” బాడ్ లక్ ఫెలో ని ఎవరు బాగు చేయలేరు, గుడ్ లక్ ఫెలో ని ఎవరు ఆపలేరు” అన్నట్లుగా అదే కృష్ణం రాజు గారు సినీ రంగ ప్రవేశం చేయటం , రెబల్ స్టార్ గ వెలుగొందటం మనందరికీ తెలిసిన విషయమే. సో, నోబడి కెన్ స్టాప్ వెన్ గాడ్ ప్రొపోజస్!!!