అందం, శరీరసౌష్టవపరంగా ఎవరూ పర్‌ఫెక్ట్‌గా ఉండలేరని..ప్రతి ఒక్కరిలో ఏదో ఒకలోపం ఉండితీరుతుందని చెప్పింది గోవా భామ ఇలియానా. స్వీయలోపాల్ని అధిగమించే ప్రయత్నంలోనే చక్కటి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుందని పేర్కొంది. ఇలియానా మట్లాడుతూ ‘ఒక్కోసారి అద్దంలో చూసుకున్నప్పుడు ముఖంపై మెటిమలు, మచ్చలు లాంటివి కనిపించడం సహజం. వాటిని సీరియస్‌గా తీసుకోవద్దు. నీలోని సహజసిద్ధమైన అందాన్ని అవి సూచిస్తాయి.
మన లోపాల్ని క్షమించుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా జీవితాన్ని సాగించడంలోనే అసలైన ఆనందం దాగి ఉంటుంది. మనుషులంటే అందంగా చెక్కిన శిల్పాలు కాదు. వ్యక్తుల్లో వుండే శారీరక, మనోస్థాయిల భేదాలే ప్రతి ఒక్కరికి వారిదైన స్వతంత్య్రమైన వ్యక్తిత్వాన్ని తీసుకొస్తాయి’ అని తాత్వికధోరణిలో వ్యాఖ్యానించింది. లాక్‌డౌన్ సమయంలో కాస్త బొద్దుగా తయారైన ఈ అమ్మడు యైటీ డేస్ పేరుతో ఎనభైరోజుల పాటు పూర్తిగా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టి తిరిగి నాజూకు రూపాన్ని సంతరించుకుంది.