in

no more glamour roles, says dusky pooja hegde!

బీటౌన్ లో చేసిన సినిమాలన్నీ వర్క్ అవుట్ కాకపోవడంతో మళ్లీ సౌత్ సినిమాల మీదే ఫోకస్ చేయాల్సి వచ్చింది. తెలుగులో ఇంకా ఛాన్స్ అందుకోలేదు కానీ తమిళ్ లో సూర్యతో రెట్రో సినిమా పూర్తి చేసింది పూజా హెగ్దే. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్దే డీ గ్లామరస్ లుక్ తో కనిపిస్తుంది. పూజా హెగ్దే సినిమాలో ఉంటే గ్లామర్ షో పక్కా అనుకునే ఆమె ఫ్యాన్స్ కి ఇది కాస్త నిరాశపరచే విషయమే..

కానీ పూజా బేబీ మాత్రం రెట్రో చేసినందుకు సూపర్ హ్యాపీ అనేస్తుంది. అంతేకాదు ఇక మీదట తన ఒరిజినాలిటీ అదే పాత్ర ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. గ్లామర్ రోల్స్ చేయడం వల్ల సినిమా సక్సెస్ అవుతుంది కానీ కెరీర్ కి హెల్ప్ అవ్వదని.. అందుకే ఇక మీదట తను కూడా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలనే చేయాలని అనుకుంటున్నా అని పూజా హెగ్దే చెప్పుకొచ్చింది. రెట్రో సక్సెస్ కొడితే పూజాకి కోలీవుడ్ నుంచి మరికొన్ని ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

Which number of boyfriend is this, Shruti Haasan opens up!