in

no glamor show but still sai pallavi is the most wanted!

సాయిపల్లవి సింపుల్‌గా ఉంటుంది కాబట్టే..అన్ని రకాల ఆడియన్స్‌‌ను ఆకట్టుకోగలిగారు. తన యాక్టింగ్, డ్యాన్స్‌తో అందర్నీ ఇంప్రెస్ చేసేశారు. అందుకే ఆమెకు అవకాశాలకు కొదవలేదు. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్నారు. ఆమెకు క్యారెక్టర్ నచ్చకపోతే సినిమాలు చేయరు. గ్లామర్ పాత్రలు అసలే చేయరు.. ఆమెను ఆ పాత్రలు చేయమని కూడా ఎవరూ అడగరు. ఒకవేళ ఎవరైనా అడిగినా ఆమె నిర్మోహమాటంగా నో చెప్పేస్తారు..

స్టార్‌డమ్, ఇమేజ్ వచ్చిన తర్వాత చాలామంది హీరోయిన్స్ మారిపోతుంటారు. మొదట్లో గ్లామర్‌కి నో చెప్పినప్పటికీ..ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో మళ్లీ గ్లామర్ పాత్రలకు ఓకే చెప్పిన వారు చాలా మందే ఉన్నారు. కానీ సాయి పల్లవి మాత్రం తాను అలా చేయనంటూ మొహమాటం లేకుండా చెబుతోంది. బాలీవుడ్‌లో గ్లామర్ రోల్స్ ఎక్కువ. కానీ అలాంటి బాలీవుడ్‌ను సైతం తన సింప్లిసిటీతో మెప్పించేసింది. అందుకే అక్కడ ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. రామాయణం కోసం సీతగా సాయిపల్లవినే ఓకే చేశారు..!!

Krishna Vamsi Apologizes now For showing actress Bold!