చాలా సందర్భాల్లో హీరోయిన్స్ తమ పర్సనల్ లైఫ్‌కు సంబధించిన విషయాలను పంచుకుంటూ ఉంటారు. చాలా మంది తమ గత ప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. స్కూల్ డేస్ లవ్ స్టోరీస్, ఇంటిపక్కనే అబ్బాయితో క్రాష్ అంటూ వారి మధురానుభూతులను పంచుకుంటూ ఉంటారు. ఈ అలానే ఈ బ్యూటీ కూడా తన ప్రేమ కథను బయట పెట్టేసింది. ఆ భామ ఎవరో కాదు నివేద పెత్తురాజ్. చిత్రలహరి, అలవైకుంఠపురంలో, రెడ్ వంటి సినిమాలతో మంచి గుర్తిపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లవ్ స్టోరీ చెప్పుకొచ్చింది. తాను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఓ కుర్రాడు తనను ప్రేమించాడని చెప్పింది నివేద.
అప్పట్లో ఒక అబ్బాయి తనను చాలా ఇష్టపడ్డాడని.. ప్రేమికుల దినోత్సవం రోజున ఒక అబ్బాయి వచ్చి పూల బొకే ఇచ్చి నీ కోసం బయట ఒకడు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను ఎవరా..? అని వెళ్లి చూశాను. అక్కడ ఒక అబ్బాయి నిజంగానే నా కోసం ఎదురుచూస్తున్నాడు. అతని దగ్గరకు వెళ్లి విషయం ఏమిటని అడిగితే.. ఒక ఏడాదిగా పాలో అవుతున్నానని.. చాలా సిన్సియర్‌గా ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత లవ్ లెటర్ కూడా ఇవ్వాలని చూశాడు. అంతలోనే నేను నో చెప్పేశా. లవ్ లెటర్ కూడా తీసుకోలేదు.. కానీ.. అతడిచ్చిన పూల బొకేను మాత్రం తీసుకున్నా. అవి చాలా బాగున్నాయి. అందుకే తీసుకున్నా అని అంది. ఆ తర్వాత అతన్ని తానెప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చింది. తన జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రపోజల్ అని చెప్పిందిట నివేద. ఆతర్వాత ఇంతవరకు తాను ఎవ్వరిని ప్రేమించలేదని అంటుంది ఈ బ్యూటీ.