నిత్యమీనన్ పేరు.. ఈమధ్య వార్తల్లో తెగ వినిపిస్తోంది. ముఖ్యంగా నిత్యమీనన్ పెళ్లి చేసుకోబోతోందన్న ఓ వార్త గట్టిగా షికారు చేస్తోంది. ఓ మలయాళ హీరోతో నిత్య సన్నిహితంగా ఉంటోందని, త్వరలో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సౌత్ ఇండియా అంతా కోడై కూస్తోంది. దాంతో ఆ హీరో ఎవరా? నిత్య పెళ్లి ఎప్పుడా అంటూ అందరూ ఆసక్తిగా చూడడం మొదలెట్టారు..ఇప్పుడు ఈ వార్తలపై నిత్యమీనన్ క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ ఒట్టి పుకార్లే అని, అందులో నిజం లేదని తేల్చేసింది.
ఇలాంటి వార్తలు రాసేటప్పుడు కాస్త ఆలోచించుకోవాలని హితవు పలికింది. “ఏ విషయమైనా నిజమని తెలిసిన తరవాతే.. దాన్ని ప్రచురించండి. అనవసరమైన గాలి వార్తలకు ప్రాధాన్యం ఇవ్వొద్దు“ అంటూ మీడియాకు చురక అంటించింది. దాంతో.. నిత్యమీనన్ పెళ్లి వార్తలన్నీ ఒట్టిదే అని తేలిపోయింది. ఇటీవలే `భీమ్లా నాయక్`తో టాలీవుడ్ ని మళ్లీ పలకరించింది నిత్య. ఆహాలో ఓ రియాలిటీ షోలో నిత్య జడ్జ్ గా వ్యవహరించిన సంగతి కూడా తెలిసిందే.