
సౌత్ సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లకు యూట్యూబ్ లో గత కొన్నేళ్ళుగా భారీ స్పందన దక్కుతోంది. అందులోనూ ముఖ్యంగా తెలుగు సినిమాలను హిందీ ప్రేక్షకులు ఎగబడి మరీ చూస్తున్నారు. మన హీరోల మాస్ యాక్షన్ కు.. డ్యాన్సులకు.. కామెడీలకు ఫిదా అయిపోతున్నారు. దీంతో ఆ సినిమాలకు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ రామ్ సినిమాలు హిందీ డబ్ సినిమాలు యూట్యూబ్ లో దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా రామ్ సరసన నితిన్ కూడా చేరాడు..నితిన్ నటించిన నాలుగు సినిమాలు 100 మిలియన్ల మార్క్ దాటడం విశేషం. ‘LIE’.. ‘ఛల్ మోహన్ రంగా’.. ‘అ ఆ’.. ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలలో ఒక్కొక్క సినిమాకు 100 మిలియన్ల వ్యూస్ దాటి ముందుకు సాగుతూ ఉండడం విశేషం. ఈ నాలుగు సినిమాల్లో మూడు సినిమాల రైట్స్ ఆదిత్య మ్యూజిక్ వారి చేతిలో ఉండడం విశేషం.

