
లాక్ డౌన్ కారణముగా సినిమా ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు పడుతుంది. సినిమా షూటింగ్ లన్ని ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ ల్యాబ్ లోనే ఆగిపోయాయి. అయితే కొన్నిసినిమా ఓటీటీ వేదికగా విడుదల కానున్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అందాల భామ అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన విడుదల సమయానికి కరోనా అడ్డం వచ్చింది. అయితే తాజాగా నిశ్శబ్దం సినిమాను ఓటీటీ వేదికగా విడుదల కానుందని తెలుస్తుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కోన వెంకట్ సమర్పిస్తున్నారు. లాక్డౌన్ పొడగింపు, ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో దర్శకనిర్మాతలు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అనుష్క, మాధవన్, అంజలి వంటిస్టార్లు నటించడం, సౌతిండియాలో ఈ సినిమాపై క్రేజ్ ఎక్కువగానే ఉండటంతో ‘నిశ్శబ్దం’కు భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు సమాచారం.

