
నిర్మాత గురించి సరదాగా నిర్వచించిన ఇద్దరు గొప్ప సినీ రచయితలు. వారు ఏమన్నారో తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. మనసు కవి ఆత్రేయ గారు ఒక సారి తనకు ఎదురుపడిన ఒక నిర్మాతను, ఏమండీ సినిమా అమ్మేశారా అని అడిగారట,” అమ్మ” లేదండి అన్నారట, దానికి వెంటనే ఆత్రేయ గారు, ఏమిటి” అమ్మ” లేదా? అందుకేనయ్యా మిమ్మల్ని “నిర్ మాత “అన్నది, అని అన్నారట, అంటే” నిర్-మాత” అని విడగొట్టి చెప్పటం వలన తల్లి లేని వాడు అనే అర్ధం వస్తుంది.అలాగే ఒక సారి శ్రీ శ్రీ గారిని నిర్మాత గురుంచి నిర్వచించమంటే ఆయన ఈ విధం గ సెలవిచ్చారట, సినిమా బాగా ఆడితే ” వాసన్” లేకుంటే ” ఉపవాసన్” అన్నారట. అంటే సినిమా బాగా ఆడితే” జెమినీ స్టూడియోస్ వాసన్” లేకుంటే తినడానికి తిండి కూడా కరువు అవుతుంది అని అర్ధం. ఆ రోజుల్లో జెమినీ వాసన్ గారు విజయవంతం అయిన సినిమా లు నిర్మించి ధనవంతుడయినా నిర్మాత గ పేరు పొందారు అందుకే శ్రీ శ్రీ గారు వాసన్ గారితో పోల్చారు.

