మూవీ మొఘుల్ రామ నాయుడు గారు, ఆయన ఉఛ్వాసం సినిమా నిశ్వాసం సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద శతాధిక చిత్రాల నిర్మాత, దాదాపుగా అన్ని భారతీయ భాషలలో సినిమాలు నిర్మించిన ఏకైక నిర్మాత. ఇప్పుడు వస్తున్న నిర్మాతలు ఒక చిత్రం ప్లాప్ అయితే ఇక ఇండస్ట్రీ లో కనపడటం లేదు ఎందుకంటె వారికీ సినిమా ఒక బిజినెస్ కానీ రామ నాయుడు గారికి ఒక ప్యాషన్.స్క్రీన్ ప్లే అంటే ఏమిటో తెలియని వారంతా నిర్మాతలు అవుతున్నారు. రామ నాయుడు గారు అన్ని సినిమాలు ఎలా నిర్మించ గలిగారు అంటే, ఆయన స్క్రీన్ ప్లే మొత్తం క్షణ్ణంగా చదివే వారు, డైలోగ్స్ అన్ని కంఠతా ఉండేవి. దీనికి ఒక ఉదాహరణ ఇక్కడ మనం చెప్పుకోవాలి . రామ నాయుడు గారు ప్రేమ నగర్ చిత్రం నిర్మిస్తున్నప్ప్పుడు డైరెక్టర్ కె.ఎస్. ప్రకాశ రావు గారు ఒక డైలాగు మార్చరట, సెట్ లో ఉన్న నాయుడు గారు అదేమిటండి స్క్రిప్ట్ లో ఉన్న డైలాగ్ కాకుండా వేరే డైలాగు ఎందుకు చెప్పించారు అని చెప్పి, చిరాకుగా సెట్ బయటకు వెళ్లిపోయారట.
కోపం కాస్త చల్లారాక ఇదేమిటి దిగ్గజ డైరెక్టర్ ప్రేక్ష రావు గారిని అంత మాట అనేశాను అనుకోని నొచ్చుకొని, ప్రకాశ రావు గారి వద్దకు వెళ్లి ఏమి అనుకోకండి ఏదో మూడ్ లో ఆలా అనేశాను అనగానే, ప్రకాశ రావు గారు కూడా నవ్వి ఊరుకున్నారట. ఇంకో సందర్భం లో అవుట్ డోర్ లో గుట్టలు, మిట్టలలో హీరోయిన్ వాణిశ్రీ చేయి పట్టి నడిపిస్తున్న నాయుడు గారిని చూసి, అక్కినేని గారు ఈ చిత్రంలో హీరో మీరా, నేనా? అని అడిగారట సరదాగా, మీకేముంది సర్, హీరోయిన్ ఎక్కడయినా పడి కాస్ట్యూమ్స్ పాడు అయితే ఈ రోజు షూటింగ్ ఆగి పోతుంది, ఒక రోజు షెడ్యూల్ వేస్ట్ అయిపోతుంది అందుకే ఈ తిప్పలు, హీరో మేరేనండి బాబు అని నవ్వుకున్నారట. ఎంత ఇంవోల్వెమెంటో చూడండి ఇప్పటి నిర్మాతలు అసలు షూటింగ్ స్పాట్ కె రారు, క్యాషియర్లు గ మారిపోయారు పాపం, అది కేవలం వారి తప్పు మాత్రమే కాదు హీరో, డైరెక్టర్ సెంట్రిక్ గ ఇండస్ట్రీ మారిపోయింది, అందుకే నిర్మాతలు ఒక సినిమాతోనే గల్లంతు అవుతున్నారు..!!