భానుమతి గారి అహం తెబ్బతింది, ” పండంటి కాపురం” సినిమాకు పోటీగా సినిమా తీయాలనుకున్నారు. కృష్ణ గారు నిర్మించిన “పండంటి కాపురం” సినిమాలో రాణి మాలిని దేవి పాత్రకు మొదట భానుమతి గారిని అనుకున్నారు. భానుమతి గారు కధా చర్చల్లో కూడా పాలుగోన్నారు, విషయం తెలిసిన నిర్మాత భావఞ్ఞనారాయణ గారు కృష్ణ గారిని కలిసి, ఏమయ్యా నీకు ఆటంబాంబ్ తో సినిమా చేయాలనీ ఉందా, భానుమతి గారిని విజయ వారే భరించలేక పోయారు అని బెదరగొట్టేసారు. ఏమి చేయాలో తోచక, చివరికి ఆ క్యారెక్టర్ కి జమున గారిని సెలెక్ట్ చేసుకొని, ఆ విధం గ పత్రిక ప్రకటన కూడా ఇచ్చారు కృష్ణ గారు. అది చూసిన భానుమతి గారికి కోపం వచ్చింది, కృష్ణ గారు షూటింగ్ కూడా మొదలు పెట్టిన తరువాత, అటువంటి స్టోరీ తోనే తాను కూడా పోటీగా ఒక సినిమా నిర్మించాలని నిర్ణయించుకొని,
అటువంటి కధే తయారుచేసుకొని అందులో ఒక పాత్ర కోసం గుమ్మడి గారిని అడిగారు, తాను అటువంటి పాత్ర పండంటి కాపురం లో నటిస్తున్నానని, తనకు కొంచెం టైం కావాలని అడిగిన గుమ్మడి గారు, షూటింగ్ విరామం సమయం లో, విషయం కాస్త అందులో నటిస్తున్న నటీనటులతో చెప్పారు, వెంటనే ఎస్.వి.రంగ రావు గారు, అదేమిటి ఆలా ఎలా చేస్తుంది ఆవిడా, మనమంతా చూస్తూ ఉరుకుంటామా అని, మాములుగా షూటింగ్ రాకుండా సతాయించే ఎస్.వి.ఆర్. నెల రోజులు మందు జోలికి పోకుండా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి, తొంభై రోజుల్లో సినిమా పూర్తి చేసేసారు. వెంట వెంటనే సినిమా కూడా రిలీజ్ చేసారు. ఆ దెబ్బతో భానుమతి గారు తన ప్రయత్నం విరమించుకోక తప్పలేదు.ఆ విధంగా జమున గారికి ప్రతిష్టాత్మకం అయిన రాణి మాలిని దేవి పాత్ర ధరించే అవకాశం దక్కింది.