నిఖిల్ సిద్దార్ధ్, వర్ధమాన కధానాయకుడు, ఈయన హీరో అవ్వాలని 10 ఇయర్స్ ఏజ్ లోనే డిసైడ్ అయ్యాడు, తాను హీరో అవుతానా, లేదా తెలుసోకోవటం కోసం అతను చేసిన ప్రయత్నం సరదాగా ఉంటుంది. మాస్టర్ నిఖిల్ ఒక సారి నాంపల్లి ఎక్సిబిషన్ కి వెళ్లి, అక్కడ ఉన్న ఒక జాతకం చెప్పే కంప్యూటర్ స్టాల్ కి వెళ్లి, తాను హీరో అవుతానా అని ఒక ప్రశ్న సంధించాడు, దానికి సమాధానం, అవును అనో, లేక కాదు అనో రాలేదు ట్రై ,ట్రై,ట్రై,ట్రై, అంటూ వచ్చింది. అంటే మనం ట్రై చేస్తూ ఉంటె హీరో అవుతాము అని మనసులో పడిపోయింది, ఇంజనీరింగ్ అయిన తరువాత ట్రై చేయటం మొదలెట్టారు, మొదట ట్రై, హైదరాబాద్ నవాబ్స్ అనే మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్, అసలు సినిమా అంటే ఏమిటి అని తెలుసుకొనేందుకు ఉపయోగ పడింది,
nikhil jeevithanni marchesina computer sastry!
ఆ తరువాత సెకండ్ ట్రై , ఈ టీ.వి. వారు నిర్మించిన చదరంగం అనే సీరియల్ లో యాక్టర్ అయ్యారు, అంటే కెమెరా వెనక నుంచి కెమెరా ముందుకు వచ్చారు, మొదటి సంపాదన 5000 రూపాయలు అందుకున్నారు ఆ తరువాత సినిమా ఛాన్స్ కోసం సుమారు ఒక 100 ట్రై లు చేసారు, కొన్ని సినిమా లకు సెలెక్ట్ అయ్యారు, కానీ కొన్ని మొదలు కాలేదు, కొన్ని మళ్ళి ప్రొడ్యూసర్స్ కనపడకుండా పోయారు, నిఖిల్ కి అప్పుడు తెలియదు, హ్యాపీ డేస్ రూపం లో తన ఫైనల్ ట్రై వెయిట్ చేస్తుంది అని, ఒక శుభ ముహూర్తం లో శేఖర్ కమ్ముల చేసిన ఆడిషన్స్ కు వెళ్ళటం నలుగురు హీరోలలో ఒకడి గ సెలెక్ట్ అవ్వటం జరిగిపోయాయి. ఆ విధంగా కంప్యూటర్ శాస్ట్రీ గారు చెప్పిన, ట్రై, ట్రై, ట్రై, సిధ్ధాంతం నమ్మి, అలుపెరుగని ట్రై లు చేసి హీరో గ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ సిద్దార్థ. కంప్యూటర్ శాస్ట్రీ గారు తన ట్రై,ట్రై,ట్రై,ట్రై, సిధ్ధాంతం తో మనకు ఇచ్చిన ఒక ముద్దుల హీరో నిఖిల్ సిధ్ధార్ద్.