సినీ నటుడు కొణిదెల నాగబాబు కుమార్తె నిహారిక అంశం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ జరుగుతోందనే సమాచారంతో హైదరాబాదులోని ఓ పబ్ పై పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఆమె పట్టుబడ్డారు. పబ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఆమె కూడా ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో ఆమె వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, తన కుమార్తె తప్పేమీ లేదని పోలీసులు చెప్పారని నాగబాబు వెల్లడించిన విషయం తెలిసిందే.
Niharika Konidela’s Mother Padmaja finally Responds on Pub Issue!!
తాజాగా నిహారిక గురించి ఆమె తల్లి పద్మజ స్పందించారు. తన కూతురు ఏమిటో, ఎలాంటితో తనకు తెలుసని ఆమె అన్నారు. నిహారిక ఎప్పుడూ తప్పు చేయదని చెప్పారు. పబ్ కు సంబంధించిన వార్తలు వస్తున్నప్పుడు తాము ఎంతో బాధపడ్డామని తెలిపారు. నిహారిక తప్పు చేసిందంటే తాను నమ్మనని చెప్పారు. తప్పు చేయనంత వరకు తాము భయపడమని అన్నారు. నిహారిక ఎక్కడికి వెళ్లినా తాను ధైర్యంగానే ఉంటానని… ఏదైనా జరిగితే చూసుకోవడానికి బావగారు చిరంజీవి ఉన్నారని… ఆయనే తమకు ధైర్యమని, ఆయన ఉన్నంత వరకు తమకు ఏమీ కాదని చెప్పారు.