మీకు కనుక టాలీవుడ్ హీరోలతో సినిమా చేసే అవకాశం వస్తే ఏ హీరోలతో ఏ జానర్ లో సినిమాలు చేస్తారు అంటూ ఈమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు నిహారిక సమాధానం చెబుతూ..మహేష్ బాబుతో మైథాలాజికల్ సినిమా చేస్తానని తెలిపారు. ఇక పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో అద్భుతమైన కామెడీ పండించారు అదే తరహా సినిమా ప్రభాస్ తో చేస్తానని తెలిపారు.
ఇకపోతే తన బావ అల్లు అర్జున్ తో కూడా సినిమా చేస్తానని, ఇప్పటివరకు ఆయన యాక్షన్ సినిమాలు చేశారు కనుక తనతో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా లవ్ స్టోరీ చేస్తాను అంటూ నిహారిక కామెంట్లు చేశారు. ఇక ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాపం స్నేహారెడ్డి పరిస్థితి ఏంటి ఆమె ఒప్పుకుంటుందా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు..!!