2018లోనే నిధి అగర్వాల్ పరిచయమైంది. ఈ తొమ్మిదేళ్లలో తెలుగులో ఆమె చేసింది నాలుగు సినిమాలే. పోనీ మిగతా భాషలలో బిజీగా ఉండటం వలన అలా జరిగిందేమో అంటే, అలాంటిదేమీ లేదు. చక్కని కనుముక్కుతీరుతో కట్టిపడేసే ఈ సుందరి, టాలీవుడ్ ని ఏలేస్తుందని చాలామంది అనుకున్నారు. వాళ్ల అంచనాలతో తనకి సంబంధం లేదన్నట్టుగానే నిధి అగర్వాల్ ఉండిపోయింది..
అవకాశాలు అందుకోవాలనే ఉత్సాహం.. ఉరుకులాట నిధి అగర్వాల్ కి ఎందుకు లేదనేది అర్థం కాదు. నిధి కంటే చాలా లేట్ గా వచ్చిన శ్రీలీల..కృతి శెట్టి కూడా, ఆమె కంటే ఎక్కువ సినిమాలే చేశారు. ఇక ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే గట్టిపోటీని ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే నిధి చేసిన ‘హరిహర వీరమల్లు’ ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. ఆ తరువాత కొంత గ్యాప్ తో ‘రాజా సాబ్’ పలకరించనుంది. ఈ రెండూ కూడా మంచి ప్రాజక్టులే. మరి ఈ సినిమాలతోనైనా నిధి రేస్ లోకి అడుగుపెడుతుందేమో చూడాలి.!!