
పబ్‌జీ గేమ్ లో ఎంతలా మునిగిపోయారంటే పబ్జీ మాయలో చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఈ గేమ్ వ్యసనంగా మారుతుండటం తో దీనికి దూరంగా ఉండాలని పలువులరు ప్రముఖులు కూడా హెచ్చరించారు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ వలన ఇంటికే పరిమితమైన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తన ట్యాబ్‌లో పబ్‌జీ గేమ్ ఆడుతుండగా, ఎవరో షూట్ చేశారు. దీనిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ. తాను పబ్జి ఆడుతూ పబ్ జీ గేమ్‌కి సంబంధించిన ఆ వీడియోని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ “అండ్ ఇట్ బిగిన్స్” అంటూ ట్వీట్ చేసింది నిధి పాప. ఇక అందాలభామ కుర్రకారుకి నచ్చిన ఆటలోకి దిగడంతో కొందరు పబ్ జీ ప్రేమికులు నిధిని పబ్జీ ఐడీ ఇవ్వమని.. మీతో ఆడతామని కోరారు క్యూ కట్టి మెసేజ్ లు చేస్తున్నారట.
నిధి ఆ మెసేజ్ లు చూసి ఎంజాయ్ చేస్తుంది ఏమో మూడ్ బాగుంటే ఆ కామెంట్స్ చేస్తున్న వాళ్లలో ఎవరొకరితో ఆడుతుందేమో పబ్జి.. ఆ అదృష్టం ఎవరికి దక్కేనో మరి. ఇక నిధి మాత్రం ఆన్‌లైన్ ద్వారా నటనలో శిక్షణ తీసుకుంటూ బిజీగా ఉంది నిధి అగర్వాల్. ఇక కష్టాల్లో ఉన్నవారిని ఆడుకోడానికి ఆమె పీఏం కేర్స్, సీఏం రిలీఫ్ ఫండ్‌తో పాటు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సీసీసీ కి విరాళాన్ని అందజేసింది. ప్రస్తుతం నిధి తెలుగులో అశోక్ గల్లా సరసన ఓ చిత్రం తమిళంలో జయం రవి సరసన భూమి అనే చిత్రం చేస్తుంది.

