in

never really had the courage to do it in past : samantha

తాజాగా ఓ లీడింగ్ మ్యాగజైన్‌ కవర్ ఫొటోలు హాట్ లుక్స్‌తో కనిపించింది ఆశ్చర్యానికి గురి చేసింది సామ్. ఆకర్షణీయమైన సౌందర్యం, కళ్లు తిప్పుకోలేని అందంతో కుర్రకారుకు గిలిగింతలు పెట్టిస్తోందీ ముద్దుగుమ్మ. ఈ విషయంపై సామ్ స్పందించింది. తన యాక్టింగ్ కెరీర్ గురించి చెబుతూ గతంలో తన స్కిన్‌ను చూసి ఎంతో ఇబ్బందికరంగా ఫీలయ్యేదాన్నని స్పష్టం చేసింది.

సామ్ తన కవర్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. “ఎన్నో ప్రాజెక్టుల్లో పనిచేసిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇది వయస్సు, పరిణితి ద్వారా వస్తుంది” అని సమంత తన కవర్ ఫొటో కింద క్యాప్షన్ జతచేసింది..“నేను నా స్కిన్ గురించి కంఫర్ట్‌గా ఉండేందుకు కొంత సమయం పట్టింది. ఇప్పుడు ఐటెం సాంగ్ అయినా లేదా హార్డ్ కోర్ యాక్షన్ పాత్రలైన, విభిన్నమైన క్యారెక్టర్లయినా చేయడానికి నమ్మకంగా ఉన్నాను..

బహుశా నేను ఇలాంటి పాత్రలు చేయడానికి నాకు ధైర్యం సరిపోక ఉండవచ్చు” అని సామ్ పేర్కొంది. ప్రస్తుతం సమంత వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. శాకుంతలం, యశోధ అనే చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ కొన్ని ఆఫర్లు చేజిక్కించుకుంది. ఇది కాకుండా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఓ చిత్రానికి పచ్చా జెండా ఊపింది. ఇటీవలే ఈ సినిమా పట్టాలెక్కింది. కశ్మీర్‌లోయలో ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.

shriya photoshoot stills in trendy outfit!

finally..nayanthara announces her wedding date!